November 28, 2026
Explore
ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన యువతిని తీసుకొస్తానని రూ.50 లక్షల మోసం!

ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన యువతిని తీసుకొస్తానని రూ.50 లక్షల మోసం!

November 28, 2026 | Andhra Pradesh

మేడ్చల్ ముచ్చట్లు:

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తాంత్రిక పూజల పేరుతో రూ.50 లక్షల భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకుని వెళ్ళిపోయిన తన కుమార్తెను తిరిగి ఇంటికి రప్పిస్తామని నమ్మించి, కుందనపల్లికి చెందిన ఒక తండ్రి నుంచి నిందితుడు క్రాంతి కుమార్ రూ.50 లక్షలు వసూలు చేశాడు. బాధితుడు తన ప్లాటును అమ్మి మరి డబ్బులు ఇచ్చాడు. 20 రోజులు గడిచినా కుమార్తె రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిందితుడు కీసర కాళీమాత ఆలయంలో పూజలు చేసే క్రాంతి కుమార్‌గా గుర్తించి అరెస్టు చేసి, సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

Tags: A woman who eloped for a love marriage—someone promised to bring her back, but it turned out to be a ₹50 lakh scam!