November 28, 2026
Explore
‘బాహుబలి 2’ రికార్డు బద్దలు.. ‘రామాయణ’ వసూళ్ల ప్రభంజనం!

‘బాహుబలి 2’ రికార్డు బద్దలు.. ‘రామాయణ’ వసూళ్ల ప్రభంజనం!

November 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారతీయ సినీ చరిత్రలో ‘రామాయణ’ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,790.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో ‘బాహుబలి 2’ సాధించిన రూ.1,788.06 కోట్ల రికార్డును అధిగమించింది.

భారత్‌లో ఈ చిత్రం రూ.1,000.55 కోట్ల నెట్ వసూళ్లు, రూ.1,195.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.595 కోట్లు రాబట్టగా, ఉత్తర అమెరికాలో 2.92 కోట్ల డాలర్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 4.17 కోట్ల టికెట్లు అమ్ముడవడం విశేషం. ఇక ఈ చిత్రానికి రెండో భాగాన్ని దీపావళి 2028లో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

భారీ వసూళ్లతో భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సరికొత్త చరిత్ర సృష్టించింది!

Tags; ‘Baahubali 2’ record shattered.. ‘Ramayana’ creates a storm at the box office!