November 28, 2026
Explore
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షలు

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షలు

November 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జవహర్‌ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు ప్రశాతంగా నిర్వహించినట్లు శనివారం ఎంఈవో నటరాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాలలోను మొత్తం 396 మంది పరీక్షకు హాజరుకాగా , 27 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే బసవరాజ పాఠశాలలో 216 మందికి 205 మంది , బాలికల పాఠశాలలో 207 మందికి 191 మంది హాజరైయ్యారని తెలిపారు. రెండు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించి, చీఫ్‌ సూపరింటెండెంట్లు , డిపార్ట్మెంటల్‌ అధికారులు , నవోదయ ప్రరిశీలకులు, ఇన్వీజిలేటర్ల పర్యవేక్షణలో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆయన తెలిపారు.

Tags; Navodaya entrance exams held peacefully