November 28, 2026
Explore
నూతన ఫోరెన్సిక్ క్రైమ్ సీన్ అధికారిగా డాక్టర్ జి. రాజేష్ గాంధీ బాధ్యతలు

నూతన ఫోరెన్సిక్ క్రైమ్ సీన్ అధికారిగా డాక్టర్ జి. రాజేష్ గాంధీ బాధ్యతలు

November 28, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 24×7 మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ ద్వారా జిల్లాలో నేర పరిశోధన మరింత వేగవంతమవుతుందని ఎస్పీ తెలిపారు.

నేరం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుండి శాస్త్రీయ ఆధారాలు సేకరించడం వల్ల దర్యాప్తులో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.

పక్కా శాస్త్రీయ ఆధారాలతో కోర్టులలో నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేయడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు.

నూతన అధికారి తన అనుభవంతో జిల్లాలో ఫోరెన్సిక్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags; Dr. G. Rajesh Gandhi assumes charge as the new Forensic Crime Scene Officer