November 28, 2026
Explore
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన పోలీసు భద్రతా చర్యలు

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన పోలీసు భద్రతా చర్యలు

November 28, 2026 | Andhra Pradesh

“రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సాయుధ బలగాలతో ముప్పాళ్ళ మండలంలో ఫ్లాగ్ మార్చ్“

పల్నాడుముచ్చట్లు:

పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం, మాదల, లంకెలకూరపాడు గ్రామాల్లో ముప్పాళ్ల ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో సాయుధ పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ ఫ్లాగ్ మార్చ్‌లో సుమారు 110 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోంది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడుతూ, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని ముప్పాళ్ళ ఎస్ఐ తెలిపారు.

Tags:Robust police security measures to ensure elections take place in a peaceful atmosphere