బి.కొత్తకోట ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట మున్సిపాలిటీ, సంబేపల్లి(9), రామాపురం(2) పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా అల్లరి చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు, డ్రోన్లు, వెబ్ కెమెరాలతో నిరంతర నిఘా ఉందని తెలిపారు. ఓటర్లు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
Tags:We will not tolerate any disturbances at polling stations: SP