November 26, 2026
Explore
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

November 26, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజకీయ శాస్త్ర విభాగం, జాతీయ సేవా పథకం (NSS) యూనిట్లు 1, 2 ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.సి.వి. రమణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ విశిష్టతను, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పౌరుల విధులు, ప్రజాస్వామ్య విలువలు, బాధ్యతలను వివరించారు. భారత రాజ్యాంగం దేశ ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. విద్యార్థులు రాజ్యాంగ విలువలను పాటిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

Tags; Constitution Day of India celebrated grandly at the Government Degree College