రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి నియోజకవర్గ పరిధిలో గురువారం జరిగిన తొలిదశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్ పరిశీలించారు. రామాపురం మండలం సుద్దమల్ల పంచాయతీ, బయ్యారెడ్డివారిపల్లె సచివాలయంలోని 5, 6, 7, 8 పోలింగ్ కేంద్రాలు, ఓబుల్‌రెడ్డివారిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలోని 1, 2, 3, 4 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం సంబేపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 5 నుంచి 10వ నంబరు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది హాజరు, ఎన్నికల విధుల నిర్వహణ, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. పోలింగ్ సరళిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లతో కలెక్టర్ మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డులు, స్లిప్పులను పరిశీలించి ఇబ్బందులపై ఆరా తీశారు. బీఎల్‌ఓలతో మాట్లాడి ఓటరు స్లిప్పులు అందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
Tags; Collector inspects polling stations