November 26, 2026
Explore
మాజీ ఎమ్మెల్యే సొంతూర్లో వైసీపీ మద్దతుదారుడి విజయం

మాజీ ఎమ్మెల్యే సొంతూర్లో వైసీపీ మద్దతుదారుడి విజయం

November 26, 2026 | Andhra Pradesh

రామాపురంముచ్చట్లు:

మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సొంత గ్రామమైన రామాపురం మండలం సుద్దమల్లలో వైసీపీ మద్దతుదారుడు సుభహాన్‌బాషా సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, టీడీపీ సానుభూతిపరుడు ఫరీదాబాషాపై 1,700 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఉపసర్పంచిగా సుకుమార్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. విజయం అనంతరం సుభహాన్‌బాషా మాట్లాడుతూ తన గెలుపునకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, గడికోట మోహన్‌రెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags; YSRCP supporter wins in former MLA’s hometown