November 26, 2026
Explore
హక్కులతో పాటు బాధ్యతలపై అవగాహన అవసరం

హక్కులతో పాటు బాధ్యతలపై అవగాహన అవసరం

November 26, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరుల ప్రాథమిక బాధ్యతలపైనా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్‌, గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను పఠించి ప్రతిజ్ఞ చేశారు. పారిశుద్ధ్యం విషయంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే ప్రాథమిక బాధ్యతలపై అవగాహన పెంపొందించాలని, ప్రతి పౌరుడు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

Tags; Along with rights, an awareness of responsibilities is also necessary.