November 23, 2026
Explore
చెక్‌పోస్టుల వద్ద 24×7 ముమ్మర వాహన తనిఖీలు

చెక్‌పోస్టుల వద్ద 24×7 ముమ్మర వాహన తనిఖీలు

November 23, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లాముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద 24×7 ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు.

ఎన్నికల్లో అక్రమ నగదు, మద్యం మరియు ఉచిత కానుకల రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి సరైన పత్రాలు లేకుండా అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రయాణికులు తగిన ఆధారాలు వెంట ఉంచుకుని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుల తనిఖీలకు పూర్తిగా సహకరించాలని అధికారులు కోరారు.

Tags: Intensive 24×7 vehicle checks at checkpoints