అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
డిసెంబర్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కిలో కందిపప్పు రూ.100, కిలో గోధుమ పిండి రూ.25, లీటర్ పామాయిల్ రూ.125కు అందించనున్నారు. రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.35కు విక్రయిస్తున్నారు. ధరల నియంత్రణకు ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Tags:From December 1, these are the prices for pigeon peas (kandi pappu), wheat flour, and palm oil at ration shops.