November 23, 2026
Explore
మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి

మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి

November 23, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం సందడి నెలకొంది. కూటమి తరపున మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీరామ్ కుమార్ చినబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ వేడుకకు మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సుగావాసి ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరుకానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. పోలీసులు తనిఖీలు చేసి లోనికి అనుమతిస్తున్నారు.

Tags: Bustle at the Madanapalle Municipal Office