రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి RTC డిపోలో విషాద ఘటన జరిగింది. కార్మికులపైకి బస్సు దూసుకెళ్లడంతో వంగి మళ్లకు చెందిన భారతి (34) అనే అవుట్సోర్సింగ్ కార్మికురాలు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సును శుభ్రం చేసి పార్కింగ్ చేసే సమయంలో బ్రేక్కు బదులుగా యాక్సిలేటర్ తొక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రుల ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags; Tragedy at Rayachoti RTC depot