November 23, 2026
Explore
మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎల్లంపల్లి ప్రశాంత్

మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎల్లంపల్లి ప్రశాంత్

November 23, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బీజేపీ 12వ వార్డు కౌన్సిలర్ ఎల్లంపల్లి ప్రశాంత్‌ను అధిష్ఠానం ఆదేశాల మేరకు సోమవారం ఎంపిక చేశారు. మున్సిపల్ చైర్మన్‌గా శ్రీరామ్ కుమార్ చినబాబు, వైస్ చైర్మన్‌గా ఎల్లంపల్లి ప్రశాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రశాంత్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో సందడి నెలకొంది.వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ప్రశాంత్‌కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు.

Tags:Yellampalli Prashanth as Madanapalle Municipal Vice-Chairman