బెంగళూరు ముచ్చట్లు:
బెంగళూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘ఉర్జా మిలన్’ విజ్ఞాన ప్రదర్శనలో గాలివీడు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించారు. టాటా పవర్ లోబ్ – గాలివీడు మరియు అగస్త్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు.
ఈ పోటీలలో నమూనా ప్రదర్శన విభాగంలో జి.ఎస్. అల్ఫియా, పి. సుస్మిత మరియు చిత్రపటాల రూపకల్పన విభాగంలో జి. హర్షిత తమ సృజనాత్మకతను చాటుకొని రాష్ట్రస్థాయి విజేతలుగా నిలిచారు. పాఠశాలకు, ప్రాంతానికి పేరు తెచ్చిన ఈ విద్యార్థులను ఇన్చార్జి ఎం.ఈ.ఓ.-2 ఫయాజున్నీసా, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు.
విద్యార్థులలోని శాస్త్రీయ దృక్పథాన్ని వెలికితీస్తూ వారిని నిరంతరం ప్రోత్సహిస్తున్న ఇన్చార్జి ఎం.ఈ.ఓ.-2 ఫయాజున్నీసాకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందానికి, అలాగే అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధి ఆర్. రెడ్డి శేఖర్‌కు మరియు టాటా పవర్ లోబ్ బృందానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Tags; Galiveedu students excel in state-level science exhibition