మదనపల్లె ముచ్చట్లు:
మహిళలకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వలేదంటూ నిరసన
మదనపల్లె మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్ షమీమ్ అస్లాం బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. మహిళలకు సముచిత ప్రాధాన్యత, న్యాయం కల్పించలేదని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 48 మంది కౌన్సిలర్లకు గాను 26 మంది మహిళలు ఎన్నికైనప్పటికీ, వైస్ చైర్మన్ పదవిని మహిళకు కేటాయించకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. మహిళా కౌన్సిలర్ల సంఖ్య అధికంగా ఉన్నా తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపిస్తూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. మహిళలకు సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్‌తో సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు షమీమ్ అస్లాం స్పష్టం చేశారు.
Tags; YSRCP Councilor Shamim Aslam expelled from the oath-taking ceremony meeting