- న్యాయమూర్తి పరేష్‌కుమార్ వెల్లడి
పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోర్టు ఆవరణంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి పరేష్‌కుమార్ ఆధ్వర్యంలో చెక్‌బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్‌అదాలత్‌ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల కేసుల్లో రూ.23.60 లక్షలు పరిహారం బాధితులకు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర లీగల్ సర్వీసస్ అథారిటి ఆదేశాల మేరకు ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరు తమ సమస్యలను రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని , విబేదాలతో ఘర్షణలు జరిగి మనశ్యాంతి కోల్పోతారని, ప్రతి సమస్యకు రాజీమార్గం ఎంతో మేలని సూచించారు. కేసులు పరిష్కారంలో న్యాయవాదులు, అధికారులు మరింత చొరవ తీసుకుని అధిక కేసులు పరిష్కరించి, వివాదాలు లేని గ్రామాలను ఏర్పాటు చేసేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు గురుమూర్తి తో పాటు న్యాయవాదులు మల్లికార్జునరెడ్డి, రమేష్‌బాబు, కీర్తి, సునీత, రామచంద్రప్ప, నూరి, గాయిత్రి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Tags; Rs 23.60 lakh settlement in cheque bounce cases