November 21, 2026
Explore
సంతకం ఒకేలా లేదని నామినేషన్‌ తిరష్కరణ

సంతకం ఒకేలా లేదని నామినేషన్‌ తిరష్కరణ

November 21, 2026 | Andhra Pradesh

  • బీసీలకు దక్కని గౌరవం
    -కోర్టుకు వెళ్తాం

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని భీమగానిపల్లె సర్పంచ్‌ పదవికి బీసీ నాయకుడు హేమచంద్ర నామినేషన్‌ దాఖలు చేశారు. ఇలా ఉండగా శనివారం జరిగిన పరిశీలనలో నామినేషన్‌లో సంతకాలలో తేడా ఉందంటు నామినేషన్‌ను అధికారులు తిరష్కరించడం సర్వత్ర విమర్శలకు దారితీస్తోంది. మండల బీసీ నాయకుడు హేమచంద్ర వైఎస్సార్‌సిపి మద్దతుదారుడుగా భీమగానిపల్లె సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలలో సంతాకాలు తేడా ఉందంటు ఆర్‌వో నామినేషన్‌ పత్రాన్ని తిరష్కరించి, ఈ మేరకు తిరష్కరణ పత్రాన్ని జారీ చేశారు. వైఎస్సార్‌సిపి మద్దతు దారులను పథకం ప్రకారం ఎన్నికల బరిలో లేకుండ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారని భీమగానిపల్లె పంచాయతీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

Tags: Nomination rejected due to a mismatch in the signature