నాగర్ కర్నూల్ ముచ్చట్లు:
ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి గదిలో ఫ్యానుకు ఉరివేసుకున్న వివాహిత
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లమ్మ రంగాపురం గ్రామంలో ఉంటూ, తమ రెండో కూతురు లక్ష్మీదేవి (25)కి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం టీపీగౌరారం గ్రామానికి చెందిన పగిళ్ల లక్ష్మణ్ అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితం వివాహం చేసిన బొడ్డుపల్లి కిష్ణయ్య, అలివేలు దంపతులు
పనుల కోసం హైదరాబాద్ వచ్చి, భర్త, అత్త, మామ, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్‌నగర్ సమీపంలోని బొమ్మలగుడిలో అద్దె ఇంట్లో ఉంటున్న లక్ష్మీదేవి
భర్త పెయింటర్‌గా, అత్త ఇళ్లల్లో పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న కుటుంబం
ఇటీవలే లక్ష్మణ్ తనకు ఈఎంఐలో ఫోన్ కొనివ్వడంతో తరచూ ఫోన్‌లోనే నిమగ్నమవుతున్న లక్ష్మీదేవి
ఈ క్రమంలో “ఊరికే ఫోన్ చూస్తూ కూర్చుంటే ఎలా అమ్మా, ఏదో ఒక పని చేసుకోవాలి కదా” అంటూ కూతురిని మందలించిన ఆమె తల్లి
దీంతో మనస్తాపం చెంది, ఇద్దరు పిల్లలు (కూతురు 7, కొడుకు 3)ను టీవీ చూడమని చెప్పి, గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీదేవి.
Tags: Daughter commits suicide after mother scolds her for not looking at her phone