November 21, 2026
Explore
పీఎన్ కాలనీ సర్పంచ్‌గా వరగం రెడ్డి సుజాత ఏకగ్రీవ ఎన్నిక

పీఎన్ కాలనీ సర్పంచ్‌గా వరగం రెడ్డి సుజాత ఏకగ్రీవ ఎన్నిక

November 21, 2026 | Andhra Pradesh

సంబేపల్లిముచ్చట్లు:

గ్రామ అభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తాం.. సర్పంచ్ వరగం రెడ్డి సుజాత, టీడీపీ సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి

సంబేపల్లి మండలం పీఎన్ కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా వరగం రెడ్డి సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సభ్యులు, గ్రామంలోని కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పీఎన్ కాలనీ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సర్పంచ్ వరగం రెడ్డి సుజాత, టీడీపీ సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనంతో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉందని తెలిపారు. 1979లో జనతా పార్టీలో పనిచేశానని, 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నానని చెప్పారు. తన తండ్రి మూడు పర్యాయాలు సర్పంచ్‌గా, ఒకసారి మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసి ప్రజలకు సేవలందించారని వివరించారు. తాను కూడా ఒకసారి సర్పంచ్‌గా, ఒకసారి ఎంపీటీసీగా, మూడు పర్యాయాలు పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించానని తెలిపారు.తన సతీమణి గతంలో ఒకసారి సర్పంచ్‌ తో పాటు సింగల్ విండో అధ్యక్షురాలిగా పనిచేశారని, ప్రస్తుతం పీఎన్ కాలనీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. మోటకట్ల, పీఎన్ కాలనీ గ్రామాలతో పాటు మండలంలోని ఇతర గ్రామాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని చెప్పారు.తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయడమే తన లక్ష్యమని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags;Varagam Reddy Sujatha elected unanimously as Sarpanch of PN Colony