పుంగనూరు ముచ్చట్లు:
పట్టణానికి చెందిన విశ్రాంత ఎంఈవో మొగిలప్పనాయుడు (90) శుక్రవారం మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, విద్యాశాఖకు చెందిన పలువురు స్నేహితులు , స్థానిక ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖలో ఎంఈవోగా విధులు నిర్వహించిన మొగిలప్పనాయుడు తన సేవలు ద్వారా పలువురి అభిమానం పొందారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు, స్థానికులు హాజరై నివాళులర్పించారు.
Tags:Death of retired MEO Mogilappa Naidu