తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం ఉదయం ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ రూ.5 లక్షల విలువైన 2.5 కిలోల వెండి తిరుమంజన పాత్రను బహూకరించారు.ఈ సందర్భంగా దాత తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుని, ఆలయ ఏఈవో దేవరాజులుకు వెండి తిరుమంజన పాత్రను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ కాంతం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags;Silver ‘Thirumanjana’ (ritual bathing) vessel worth Rs. 5 lakh presented to Goddess Sri Padmavathi