పుంగనూరుముచ్చట్లు:
పుస్తక పఠనంతో వివేకం, విలువలు పెంపొందుతాయని ఎంఈవో నటరాజరెడ్డి , తహశీల్ధార్ రాము అన్నారు. శుక్రవారం 59వ జాతీయ గ్రంథాలయ ముగింపు వారోత్సవాలు లైబ్రరీన్ తులసినాయక్ నిర్వహించారు. ఈ వారోత్సవాలలో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వపు , చిత్రలేఖనం పోటీలు నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఎంఈవో మాట్లాడుతూ నిరంతరం పుస్తక పఠనంతో తమని తాము మెరుగుపరుచుకోవచ్చునన్నారు. సమయాన్ని వృథా చేయకుండా విద్యార్థులు లైబ్రరీకి వచ్చి పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగులమ్మ, వెంకటపతి, నసీబ్‌జాన్, గిరిధర్, హరివెహోదలియార్, చంద్రశేఖర్, సలీం, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags;Library Week celebrations conclude