హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్‌లోని ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా డ్రైవర్ లేకుండా నడిచే ‘ఎలక్ట్రిక్ పోడ్ కార్ల’ను ప్రవేశపెట్టే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోంది. మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీసులకు వెళ్లే ఐటీ ఉద్యోగులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. HMRL ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై సాధ్యాసాధ్యాల అధ్యయనం ప్రారంభించింది.
- తొలి దశలో కూకట్‌పల్లి నుంచి నాలెడ్జ్ సిటీ వరకు 35 కిలోమీటర్ల మేర 64 స్టేషన్లతో ఈ మార్గాన్ని ప్రతిపాదించారు.
- రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా సాగే ఈ మార్గం వల్ల ఐటీ కారిడార్‌లో ప్రయాణం మరింత సులభం కానుంది.
- ఎల్బీ స్టేడియం – రాణిగంజ్, అసెంబ్లీ – బేగంపేట మధ్య కూడా పోడ్ కార్లను నడిపే అంశాన్ని సర్కార్ పరిశీలిస్తోంది.
Tags;Pod cars in Hyderabad.. A new plan by the government to put an end to traffic woes!