సంబేపల్లిముచ్చట్లు:
శెట్టిపల్లి ప్రైమరీ స్కూల్ నందు విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన శ్రీనివాసులు టీచర్ ను సస్పెండ్ చేయాలని ఏ ఐ ఎస్ ఏ విద్యార్థి సంఘం డిమాండ్.
సమాచారాన్ని గోప్యంగా ఉంచిన ప్రధానోపాధ్యాయుడు శెట్టిపల్లి వెంకటేశ్వర్లు విధుల నుండి సస్పెండ్ చేయాలి.
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లి ప్రైమర్ స్కూల్ నందు శ్రీనివాసులు ఆరో తరగతి నాలుగో తరగతి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికంగా వేధింపులకు గురిచేసిన శ్రీనివాసలను వెంటనే సస్పెండ్ చేయాలని AISA, అన్నమయ్య జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు శెట్టిపల్లి సాయికుమార్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది జరిగిన సంఘటనను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోకుండా విధులు పట్ల బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన శెట్టిపల్లి వెంకటేశ్వర్లు ఉద్యోగం నుండి టర్మినేట్ చేయాలి. ఇలాంటి ఘటనలు జరుగుతా ఉన్నా కూడా హెడ్మాస్టర్ ఎందుకు బాధ్యత వహించి ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేయలేదని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను సస్పెండ్ చెయ్యాలి లేని పక్షంలో డి ఈ ఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.
Tags;The teacher who behaved inappropriately toward a female student should be suspended.