November 20, 2026
Explore
మోటారు విద్యుత్ సరఫరా తీగ చోరీ

మోటారు విద్యుత్ సరఫరా తీగ చోరీ

November 20, 2026 | Andhra Pradesh

సుండుపల్లిముచ్చట్లు::


మండలంలోని బండకాడ ఈడిగపల్లి సమీపంలో మోటార్లకు సంబంధించిన విద్యుత్ సరఫరా తీగలు చోరీకి గురయ్యాయి. ఈ ప్రాంతానికి చెందిన నవీన్ అనే రైతు మూడు ఎకరాల్లో శనగ పంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే తన పొలంలోని మోటారుకు సంబంధించిన విద్యుత్ తీగలు ఇప్పటివరకు మూడుసార్లు చోరీకి గురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ చోరీలు జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని రైతు కోరారు.

Tags:Theft of the motor’s power supply wire