హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసం వద్ద కలకలం
చోటుచేసుకుంది. ఖమ్మం బల్లేపల్లికి చెందిన బిల్డర్ బత్తు సుచిత్ అప్పుల బాధతో ఆయన నివాసం వద్ద చేతికి గాయం చేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పవన్ కల్యాణ్‌ను కలిసి ఆర్థిక సాయం కోరేందుకే హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.
Tags; Man from Khammam attempts suicide at Pawan Kalyan’s residence