November 20, 2026
Explore
సందడిగా మారిన మదనపల్లె జడ్పీ కార్యాలయం

సందడిగా మారిన మదనపల్లె జడ్పీ కార్యాలయం

November 20, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు::

అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు ప్రమాణ స్వీకారానికి జడ్పీ కార్యాలయం జనసందోహంతో సందడిగా మారింది.

మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణ స్వీకారం ఉండడంతో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వాహనాల్లో బీటీ కళాశాల ప్రాంగణంలోని జడ్పీ కార్యాలయానికి తరలివచ్చారు.

నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కార్యాలయ ఆవరణ సందడి వాతావరణాన్ని సంతరించుకుంది.

సుగవాసి ప్రసాద్ బాబు ప్రమాణ స్వీకార వేడుకకు భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు.

Tags;Madanapalle ZP office becomes a hub of activity