November 19, 2026
Explore
బద్వేల్ నాలుగు రోడ్ల సర్కిల్‌లో టీ షాపులో అగ్నిప్రమాదం

బద్వేల్ నాలుగు రోడ్ల సర్కిల్‌లో టీ షాపులో అగ్నిప్రమాదం

November 19, 2026 | Andhra Pradesh

బద్వేల్ ముచ్చట్లు:

కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల సర్కిల్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ టీ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం.క్షణాల్లోనే మంటలు పక్కకు వ్యాపించి సమీపంలోని పచారీ షాప్, మొబైల్ షాప్, చెప్పుల షాపులకు కూడా అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. దుకాణాల యజమానులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సకాల స్పందనతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా దుకాణాలకు ఎంత మేర నష్టం వాటిల్లిందన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags; Fire breaks out at a tea shop at the four-road junction in Badvel