మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా కేంద్రం లోని మదనపల్లె మాదినకొండ హంద్రీ-నీవా కాలువ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి గురువారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. సుమారు 45 ఏళ్ల వ్యక్తిని ఎవరో పథకం ప్రకారం బండరాళ్లతో కొట్టి చంపి పరారైనట్లు తెలుస్తోంది. పట్టణానికి కూతవేటు దూరంలోనే ఈ హత్య జరగడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. మృతుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. మదనపల్లి తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Man brutally murdered in Madinakonda, Madanapalle