March 31, 2026
Explore
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్‌

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్‌

March 31, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని మంగళవారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఇస్తికఫాల్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.ద‌ర్శ‌నానంత‌రం రంగనాయకుల మండపంలో ఎస్.అబ్దుల్ నజీర్ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవోలు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోక‌నాథం, విజివో శ్రీ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: AP State Governor Visits Lord Srivari at Tirumala