పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 23న రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సమితి సభ్యుడు మున్నా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు పట్టణంలోని శుభారాం డిగ్రీ కళాశాల ఆవరణంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగు నింపుతుందన్నారు. యువత ముందుకు వచ్చి స్వచ్చంధంగా రక్తదానం చేయాలని కోరారు.
Tags; Blood donation camp on the 23rd