మదనపల్లెముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె బెంగళూరు బస్టాండులో ప్రైవేటు బస్సులు రోడ్డుపై అడ్డంగా నిలిపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ రోడ్డుపైనే ప్రైవేటు బస్సులు నిలబెట్టి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రైవేటు బస్సుల ఆగడాలపై పోలీసులు, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పందించి బస్టాండులో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Tags; Traffic comes to a standstill at the Madanapalle-Bengaluru bus stand