ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
ఆస్తి, బీమా డబ్బుల కోసం కన్నతల్లి ఆకుతోట సుంకమ్మ(76)ను కుమారుడు ఆదెప్ప కడతేర్చాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పాతగుంతకల్లులో చోటుచేసుకుంది. వాల్మీకి కూడలి సమీపంలో నివాసం ఉండే సుంకులమ్మ భర్త చెన్నయ్య చాలా ఏళ్ల క్రితమే మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు నగేశ్, ఆదెప్పతోపాటు నలుగురు కుమార్తెలు సంతానం. నగేశ్ తల్లితో కలిసి ఉండేవాడు. ఇటీవల జరిగిన లారీ ప్రమాదంలో అతను మరణించాడు. బీమా, ఆస్తి డబ్బుల కోసం ఆదెప్ప తన తల్లిని చంపేసినట్లు పెద్దకుమార్తె చెన్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Tags: He killed his own mother for the sake of property and insurance money.