. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక కేంద్రం
గుంటూరుముచ్చట్లు:
రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి పరీక్షలు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. సర్వైకల్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అమెరికాలో అందుబాటులో ఉన్న థర్మల్ కోగ్యులేటర్ పరికరాన్ని పింక్ ఆర్గనైజేషన్ సహకారంతో తీసుకొచ్చారు.
మహిళల్లో క్యాన్సర్‌పై ఉన్న భయాలను తగ్గించడంతో పాటు, వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
ఖరీదైన వైద్య పరీక్షలు, చికిత్సలను జీజీహెచ్‌లో ఉచితంగా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
30 నుంచి 65 ఏళ్ల వయసున్న మహిళలు ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. అత్యాధునిక వైద్య విధానాలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రం మూడు రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.
Tags: Free cancer screenings for female employees.