November 18, 2026
Explore
వామ్మో ఈ బాలిక..పరీక్ష వస్తే చాలు భయం తో తల వెంట్రుకలు తిన్నది.

వామ్మో ఈ బాలిక..పరీక్ష వస్తే చాలు భయం తో తల వెంట్రుకలు తిన్నది.

November 18, 2026 | Andhra Pradesh

… తీరా కడుపు నొప్పి తో బాధ పడుతూ ఉంటే హాస్పిటల్ లో డాక్టర్ చూడగా …డాక్టర్లు షాక్!

అనంతపురంముచ్చట్లు:

సర్వజనాసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి 15 ఏళ్ల బాలిక కడుపులో పేరుకుపోయిన 750 గ్రాముల వెంట్రుకలను తొలగించారు.

రాయదుర్గంలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, బరువు తగ్గడం వంటి సమస్యలతో ఆసుపత్రిలో చేరింది.

పరీక్షల్లో చిన్నప్పటి నుంచి వెంట్రుకలు తినే అలవాటు (ట్రైకోఫేజియా) ఉన్నట్లు, రాంపుజెల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు.

దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి 1.2 మీటర్ల పొడవున్న వెంట్రుకల ముద్దను తొలగించారు.

ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags: Oh my goodness, this girl—whenever an exam came around, she would eat her own hair out of fear.