November 18, 2026
Explore
నెమ్మదిగా కదులుతున్న అక్వాన్ తుపాన్

నెమ్మదిగా కదులుతున్న అక్వాన్ తుపాన్

November 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిమీ వేగంతో కదలిక

ఇవాళ ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం : ప్రఖర్ జైన్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో

​చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 620 కి.మీ, విశాఖపట్నానికి 620 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కి.మీ దూరంలో కేంద్రీకృతం

పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ రేపు సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం

​శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం

​తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120-130 కి.మీ, గరిష్ఠంగా 145 కి.మీ వేగంతో బలమైన గాలులు

రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం

కోస్తా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: ప్రఖర్ జైన్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో

Tags: Slow-moving Cyclone Akwan