November 18, 2026
Explore
భాగంపల్లిలో మరోసారి ఏకగ్రీవం

భాగంపల్లిలో మరోసారి ఏకగ్రీవం

November 18, 2026 | Andhra Pradesh

.. 20 ఏళ్లుగా ఎన్నికలు లేకుండానే సర్పంచ్ ఎంపిక!

కడపముచ్చట్లు:

కడప జిల్లా | టి. సుండుపల్లి మండలంలోని భాగంపల్లి గ్రామపంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాగంపల్లి అజయ్ రెడ్డి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దాదాపు 20 సంవత్సరాలుగా భాగంపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు పోటీ లేకుండానే ఏకగ్రీవంగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అజయ్ రెడ్డి కుటుంబానికి చెందిన వారే వరుసగా సర్పంచ్ అభ్యర్థులుగా కొనసాగుతూ వస్తున్నారని సమాచారం.

తాజాగా మరోసారి భాగంపల్లి అజయ్ రెడ్డి ఏకగ్రీవం కావడంతో గ్రామంలో ఆనందం వ్యక్తమవుతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎన్నికల పోటీ లేకుండా ఏకగ్రీవాల పరంపర కొనసాగడం గ్రామపంచాయతీ ప్రత్యేకతగా నిలుస్తోంది.

జిల్లాలోని ఇతర గ్రామపంచాయతీలకు భిన్నంగా భాగంపల్లిలో కొనసాగుతున్న ఈ ఏకగ్రీవ సంప్రదాయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Tags: Unanimous election once again in Bhagampalli