November 16, 2026
Explore
భర్త గొంతుకు నైలాన్‌ తాడు చుట్టి హత్య..!!

భర్త గొంతుకు నైలాన్‌ తాడు చుట్టి హత్య..!!

November 16, 2026 | Andhra Pradesh

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తాడని ఘాతుకం

నిజామాబాద్‌ ముచ్చట్లు:

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఒక మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘటన నిజామాబాద్‌ నగరంలో ఆదివారం కలకలం రేపింది. నిజామాబాద్‌ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోజా కాలనీ వాసి సహజత్‌ఖాన్‌ (40) వ్యక్తి భార్య ఫరానా బేగం.. కొంత కాలంగా మన్సూర్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ సంగతి తెలిసిన భర్త సహజత్‌ఖాన్‌.. భార్యను మందలించడంతోపాటు పునరావృతమైతే సహించనని హెచ్చరించాడు. ఈ విషయమై వారి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఆదివారం తెల్లవారు జామున నిద్రలో ఉన్న సహజత్‌ఖాన్‌ గొంతుకు నైలాన్‌ తాడుతో చుట్టి. చంపేసింది. బయట అందరికీ ఉరేసుకుని చనిపోయాడని నమ్మించడానికి ప్రయత్నించింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించడంతో తామే హత్య చేశామని ఫరానాబేగం, ఆమె ప్రియుడు మన్సూర్‌ ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి నలుగురు పిల్లలున్నారు.

Tags: Husband murdered by having a nylon rope wrapped around his neck..!!