పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని గ్రంధాలయంలో 59వ జాతీయ వారోత్సవాలను గ్రంధాలయ అధికారి తులసినాయక్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. విశ్రాంత తెలుగుపండితులు వెంకటపతి, రామలింగప్ప లు పుస్తక పఠనం ద్వారా విద్యార్థులు ఉన్నత రంగాలలో స్థిరపడేందుకు దోహదం చేస్తుందన్నారు. తీరిక సమయాల్లో పుస్తక పఠనం ఎంతో మంచిదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉర్ధూ లైబ్రేరియన్ నసీబ్‌జాన్, విశ్రాంత ఉద్యోగులు హరి మొదలియార్, అశోక్‌రెడ్డి, మణి, రెడ్డెప్ప, చందు, బాలమురళి, ఇంతియాజ్, గిరిధర్, సలీం, అబ్దుల్లా పాల్గొన్నారు.
Tags: Library Week Celebrations