పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బసవరాజ హైస్కూల్‌లో 1974-1976 సంవత్సర ఇంటర్మీడియట్ పూర్వపు విద్యార్థులు కలసి ఆదివారం స్వర్ణ్నోత్సవవేడుకలు నిర్వహించారు. 50 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులలో ప్రస్తుతం ఎంఈవో నటరాజారెడ్డి, విశ్రాంత అధ్యాపకులు షణ్ముగం, హరినాయుడు, సీనియర్ న్యాయవాది మల్లికార్జునరెడ్డి లు కలసి విశ్రాంత గురువులను సన్మానించారు. వారికి మెమెంటోలు అందజేసి , గురువుల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా యాబై ఏళ్ల క్రితం చదివిన స్నేహితులు గంగులప్పనాయుడు, విశ్రాంత బ్యాంక్ మేనేజర్ మహమ్మదాలి, రవింద్రనాథ్, దుర్వాసులరెడ్డి, ఇనాయతుల్లా, చంద్ర, రుక్ష్మిణి, శోభారాణి, పద్మావతమ్మ, సుశీలమ్మ , రవికుమార్ ,ద్వారకనాథరెడ్డి, ఆనందరెడ్డి, భగత్‌కుమార్‌రెడ్డి, రమణ ల ఆధ్వర్యంలో విద్యార్థులందరు గత స్మతులను పంచుకున్నారు. ఒకరునొకరు సంతోషంగా విందుభోజనాల్లో పాల్గొని , తాము చదివిన పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

Tags: Golden Jubilee Celebrations of the 1974 Alumni Batch