November 14, 2026
Explore
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక

November 14, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్, BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద ర్యాలీలు, ఊరేగింపులు, గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం నిషేధమన్నారు. కేంద్రాలకు 100 నుంచి 200 మీటర్ల పరిధిలో జనసమూహాలు గుమిగూడరాదని సూచించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ ధీరజ్ కోరారు.

Tags; Strict action if election code is violated: SP’s warning