November 14, 2026
Explore
రాయచోటి గురుకుల పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

రాయచోటి గురుకుల పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

November 14, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటిలోని మాసాపేట ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి. వినోద్ కుమార్ విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, బాల్యవివాహ నిషేధ చట్టం-2006 గురించి వివరించారు. పిల్లల రక్షణ, సంరక్షణ కోసమే జిల్లా బాలల పరిరక్షణ విభాగం పనిచేస్తోందని తెలిపారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించడంతో పాటు, ఆపదలో ఉన్న పిల్లలు సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, అత్యవసర సేవల కోసం 112 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

అనంతరం గుడ్ నైబర్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నాగేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు.

Tags; Children’s Day celebrations held in a grand manner at the Rayachoti Gurukul School