November 14, 2026
Explore
ఈ నెల 19న ఎంపీపీ, 20న జడ్పీ ఛైర్పర్సన్ల ఎన్నిక: SEC

ఈ నెల 19న ఎంపీపీ, 20న జడ్పీ ఛైర్పర్సన్ల ఎన్నిక: SEC

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో ఈ నెల 19న ఎంపీపీ, 20న జడ్పీ ఛైర్పర్సన్ల ఎన్నికలు ఉంటాయని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. వీరు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఐదేళ్లు పదవిలో ఉంటారు. ఆ తర్వాత డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. ఇటీవల గొడవలు జరిగిన నేపథ్యంలో.. 12 జిల్లాల ఎస్పీలతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించామని తెలిపారు.

ప్రత్యేక ఎస్కార్ట్ కావాలంటే కల్పిస్తాం: SEC

పంచాయతీ ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించినట్లు ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. పెండింగ్లో ఉన్న పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికలపై తిరుపతి కలెక్టరేట్లో పోలీసులతో కలిసి సమీక్ష నిర్వహించారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఎవరైనా ప్రత్యేక ఎస్కార్ట్ కావాలంటే కల్పిస్తామన్నారు. సమస్యాత్మక 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేకంగా మాట్లాడామన్నారు.

Tags; Election for MPPs on the 19th of this month, and for ZP Chairpersons on the 20th: SEC