November 14, 2026
Explore
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్..

శబరిమల భక్తులకు గుడ్ న్యూస్..

November 14, 2026 | Andhra Pradesh

శబరిమల ముచ్చట్లు:

శబరిమల యాత్రికులకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) తీపి కబురు అందించింది. 2026–27 సీజన్లో ఎన్ఐసీ సహకారంతో భక్తులందరికీ రూ.2 లక్షల ఉచిత జీవిత బీమా కల్పించనుంది. ప్రమాదాలతో పాటు గుండెపోటు వంటి సహజ మరణాలకూ ఈ బీమా వర్తిస్తుంది. యాత్రకు ముందు రోజు నుంచి ఇంటికి చేరాక 3 రోజుల వరకు ఈ రక్షణ ఉంటుంది.

ఇక పై ఇంటికే శబరిమల ప్రసాదం!

శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల కోసం తపాలా శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై భక్తులు శబరిమల ప్రసాదాన్ని నేరుగా పోస్ట్ ద్వారా తమ ఇంటికే పంపించుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తపాలా శాఖ అధికారికంగా వెల్లడించింది.

Tags:Good news for Sabarimala devotees..