November 14, 2026
Explore
చేయని నేరానికి రెండున్నరేళ్ల జైలు శిక్ష..

చేయని నేరానికి రెండున్నరేళ్ల జైలు శిక్ష..

November 14, 2026 | Andhra Pradesh

మాండ్యా జిల్లాముచ్చట్లు:


చనిపోయిందనుకున్న మహిళ బతికే ఉందని నిర్ధారణ

కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో వెలుగు చూసిన ఘటన

2019 జూన్ 23వ తేదీన పాండవపుర అనే ప్రాంతంలో మంజుల అనే మహిళ అదృశ్యమైంది

ఆమె చివరిసారిగా.. ఓ బస్ స్టాప్ వద్ద రాజేష్ అనే వ్యక్తి నుంచి ఫోన్ తీసుకొని కాల్ చేసింది

దాంతో.. అతడే మంజులను హత్య చేసి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 2021 ఆగస్టులో రాజేష్‌పై హత్య కేసు నమోదు చేసి, జైలుకు పంపించారు

రెండున్నరేళ్ల పాటు జైల్లో గడిపిన రాజేష్.. 2024 జనవరిలో బెయిల్ మీద విడుదలయ్యాడు

తాను ఏ నేరం చేయకపోయినా.. పోలీసులు తనని అరెస్ట్ చేసి, జైల్లో చిత్రహింసలకు గురి చేశారన్న రాజేష్

చేయని నేరాన్ని అంగీకరించాల్సిందిగా.. పోలీసులు జైల్లో టార్చర్ పెట్టారంటూ రాజేష్ ఆవేదన

తాను నిర్దోషినని నిరూపించుకోవడం కోసం.. లాయర్‌తో కలిసి మహిళ ఆచూకీ కోసం మళ్లీ వెతకడం ప్రారంభం

చివరికి 2026 నవంబర్ 11వ తేదీన అదృశ్యమైన మంజుల బతికే ఉందని ఆచూకీ కనుగొన్న రాజేష్ లాయర్ నటేశ్

మంజులను ప్రశ్నించగా.. ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి నచ్చకపోవడం వల్లే పారిపోయానని పోలీసులకు వెల్లడి

తాను నాగేంద్ర అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని.. తమిళనాడులో కొన్నాళ్లు ఉండి, కర్ణాటకకు తిరిగి వచ్చినట్టు స్పష్టం

మంజుల బతికే ఉందని తేలడంతో.. మొదట్లో జరిగిన దర్యాప్తుపై విచారణ చేపట్టాలని ఆదేశించిన ఉన్నతాధికారులు

Tags; Two and a half years in prison for a crime not committed..