రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి నియోజకవర్గం లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పై మరోసారి ఘాటు విమర్శలు గుప్పించిన మంత్రి మండిపల్లి
వార్డు మెంబర్ గా కూడా గెలుపొందాలేని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నాయకులను,కార్యకర్తలను ఎన్నికల సమయంలో వాడుకొని గెలుపొందిన తర్వాత తన ఎదుగుదల కోసం కష్టపడిన వారిని పాతాళానికి తొక్కడం మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నైజం….
శ్రీకాంత్ రెడ్డి నైజాన్ని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు వారి స్వతహాగా వైసీపీని పార్టీని వీడి టిడిపిలో చేరడం చూసైనా మాజీ ఎమ్మెల్యే తన నైజాన్ని మార్చుకోవాలి….
జరిగిన స్థానిక మున్సిపల్ , ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికలు ఏకగ్రీవాలు జరిగితే రౌడీయిజం చేసి,పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి పార్టీ ఏకగ్రీవాలు చేసుకుందని ఆరోపించడం మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఛాలెంజ్ చేసిన మంత్రి
శ్రీకాంత్ రెడ్డి కి దమ్ము ,ధైర్యం ఉంటే రాయచోటి నియోజకవర్గం లో జరిగే 85 సర్పంచ్ స్థానాలకు నిన్ను నమ్మి నీ అడుగుజాడలలో నడిచే ఏ కార్యకర్త అయిన వైసీపీ పార్టీ తరపున కనీసం నామినేషన్ వేసే వారు ఎవరైనా ఉన్నారా ? అని మంత్రి ఛాలెంజ్ విసిరారు..
మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిలో లోపాలు మరియు తప్పులు పెట్టుకొని ఓటమి ప్రభుత్వంపై ఎందుకు నిందలు వేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు…
శ్రీకాంత్ రెడ్డి ఎదుగుదల కోసం కష్టపడైన ప్రతి ఒక్కరిని టిష్యూ పేపర్ కన్నా హీనంగా పక్కన పెట్టాడు కనకే శ్రీకాంత్ రెడ్డి కి ఈరోజు ఈ గతి పట్టిందని మంత్రి వ్యాఖ్యానించారు…
కేవలం నీ మీద నమ్మకం లేకపోవడం వలనే వైసీపీలోని నాయకులు నామినేషన్ వేయడానికి కూడా ముందుకు రావడంలేదని ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోలేక ఓటమి ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకోవాలని శ్రీకాంత్ రెడ్డి కి తెలిపారు..
సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన నువ్వు ఓడిపోయిన మరుక్షణమే రాయచోటిని వదిలి నీ సొంత వ్యాపారాలు చూసుకున్నావే కానీ ఏ రోజైనా నమ్ముకున్న నాయకులను కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోయావా ? అని ప్రశ్నించిన మంత్రి….
జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో వైసిపి కి అంత ప్రజాదరణ ఉంటే దమ్ముంటే ఎన్నికల బరిలో నిల్చని గెలుపొంది చూపించాలని మంత్రి శ్రీకాంత్ రెడ్డి కి సవాల్ విసిరారు.
Tags: Sudarshan Reddy joins the TDP in the presence of Minister Ramprasad