November 14, 2026
Explore
5 ఆవుల దొంగతనం కేసులు ఛేదింపు: ఇద్దరు అరెస్ట్

5 ఆవుల దొంగతనం కేసులు ఛేదింపు: ఇద్దరు అరెస్ట్

November 14, 2026 | Andhra Pradesh

వాయల్పాడుముచ్చట్లు:

వాయల్పాడు, గుర్రంకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన వరుస ఆవుల దొంగతనం కేసులను వాయల్పాడు పోలీసులు ఛేదించారు. ఎస్సై సి. తిప్పేస్వామి తన సిబ్బందితో నగిరిమడుగు సబ్‌స్టేషన్ వద్ద జంగం అరవింద్(28), కోట సిద్ధార్థ(30)ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రాత్రి వేళ పొలాలు, షెడ్ల వద్ద ఆవులను దొంగిలించి పుంగనూరు సంతలో విక్రయించినట్లు తేలింది. వారి వద్ద నుంచి రూ.2,22,000 నగదు, 2 ఆవులు స్వాధీనం చేసుకున్నారు. పాడి రైతులు సీసీ కెమెరాలు, జియో ట్యాగ్స్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.

Tags: 5 cases of cow theft solved; two arrested