అమరావతిముచ్చట్లు:
స్థానిక ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా, తణుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బలగం సీతారాం కుమారులు బలగం బాబీ, బలగం రాజ్కుమార్తో పాటు వారి కుటుంబ సభ్యులు టీడీపీ గూటికి చేరారు. బలగం సీతారాం బొత్స సత్యనారాయణ సోదరుడు సతీష్ కుమార్ వియ్యంకుడు. వారందరికీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు బలగం కుటుంబం టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది.
Tags: Relatives of Botsa Satyanarayana bid goodbye to YSRCP and join TDP!